Advertisement
Google Ads BL

అందరూ ఆమిర్ లా ఉండగలరా..


కొంతమంది కాదు చాలామంది పేరున్న హీరో-హీరోయిన్స్ అత్యధిక పారితోషికాలు తీసుకోవడమే కాకుండా తమ వెంట ఉండే  పర్సనల్ స్టాఫ్ కు, అలాగే బౌన్సర్లు కి స్పెషల్ ప్యాకేజి లు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. కోలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం పూజ హెగ్డే చుట్టూ ఉన్న ఆమె పర్సనల్ సిబ్బంది విషయంలో చాలా చర్చే నడిచింది. అది నిర్మాతలకు తలకు మించి భారమే. 

Advertisement
CJ Advs

హీరోలకు, అయన పర్సనల్ సిబ్బందికి పారితోషికాలు ఇస్తూ సినిమా బడ్జెట్ పై నిర్మాతలు ఫోకస్ పెట్టకపోవడంతోనే క్వాలిటీ తగ్గిపోయింది అనే విషయం కాస్త తెలివి ఉన్న ఎవ్వరికైనా అర్ధమవుతుంది. అదే విషయం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ అందరికి అర్ధమయ్యే రీతిలో ఓపెన్ అయ్యారు. 

స్టార్లు తమ నటనతో ఆడియన్స్ కి దగ్గరవ్వాలి, అలాగే గుర్తింపు తెచ్చుకోవాలి.. కానీ ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెట్టి డిమాండ్స్ చెయ్యడం కరెక్ట్ కాదు, అసలు ఈమధ్య కాలంలో స్టార్ హీరోలు ఎవ్వరూ తమ డ్రైవర్లకు కానీ లేదంటే పర్సనల్ సిబ్బందికి కానీ శాలరీస్ ఇవ్వరట. వారికి నిర్మాతలే పేమెంట్లు ఇస్తున్నారట అది విడ్డురమే కదా. 

ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్స్ తమ ట్రైనర్లు, అలాగే వంట వాళ్లు, పర్సనల్ సిబ్బందికి కూడా నిర్మాతలే డబ్బులిస్తున్నాడు. కొందరు ఆర్టిస్టులు సెట్లో లైవ్ కిచెన్ పెట్టుకుంటున్నారు. దానికయ్యే ఖర్చు మొత్తం నిర్మాతే పెట్టాలి, వాళ్లకు ఫ్లైట్ ఛార్జ్ లు వెయ్యాలి. కోట్లలో పారితోషికాలు అందుకుంటున్న వారు తమ పర్సనల్ స్టాఫ్ కి శాలరీ ఇవ్వలేరా..  అంటూ ఆయన క్వచ్చన్ చేస్తున్నారు.  

నేను మాత్రం డే 1 నుంచి నా డ్రైవర్ సహా పర్సనల్ స్టాఫ్ ఎవ్వరికీ ప్రొడ్యూసర్స్ నుంచి డబ్బులు తీసుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ ఆమిర్ చెప్పడం చూసి అందరూ ఆమిర్ లా ఉండగలరా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Aamir Khan calls out stars making unrealistic demands on set:

Aamir Khan Slams Stars Earning In Crores Making Producers Pay For Personal staff
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs