అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 షూటింగ్ లో బిజీ అయ్యారు. రీసెంట్ గా నానమ్మ చనిపోవడం, దుబాయ్ లో సైమా అవార్డ్స్ కి హాజరవడం వంటి విషయాలతో ఆయన ఓ 15 రోజులపాటు షూటింగ్ కి బ్రేకిచ్చి హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ తో జాయిన్ అయ్యారు.
AA 22 అనౌన్సమెంట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన అట్లీ ఈ చిత్రాన్నికి సంబందించిన పాటల చిత్రకరణ ను ముంబైలో చేస్తారని, అలాగే సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని దుబాయ్ లోని రిచ్ లొకేషన్స్ అంటే అబుదాబి లాంటి కీలకమైన ప్రదేశాలలో చేపట్టనున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.
అందులో ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొన్ AA 22 షూట్ లో జాయిన్ అయ్యింది. మిగతా హీరోయిన్స్ ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈప్రాజెక్టు పై ట్రేడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. AA 22 చిత్రాన్ని 2027 లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.