కింగ్ నాగార్జున కు బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ నుంచి వ్యతిరేఖత కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఆరుగురు కామనర్స్ వచ్చారు. హరీష్, మనీష్, పవన్, ప్రియా లు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున తో వాగ్వాదం పెట్టుకున్నారు. హరిత హారిష్ అయితే తాను తప్పు చేసినా కూడా తనని కావాలనే నెగెటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ నాగార్జునని టార్గెట్ చేసాడు. నాగార్జున అతని వీడియోస్ ఎన్ని చూపించినా అతను ఒప్పుకోలేదు.
చివరికి నాగార్జున కూడా ఇదేమి నేను నిన్ను అనడం లేదు, బయట ఆడియన్స్ అంటున్న మాటలే నీకు చెబుతున్నాను, అంతేకాని హోస్ట్ గా నేను అనాల్సిన అవసరం లేదు అన్నా హరీష్ ఒప్పుకోలేదు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో మనీష్ కూడా నాగార్జున తో విభేదిస్తున్నాడు. హౌస్ లో శ్రేష్టి అడిగితే ఆపిల్ ఇవ్వలేదు, రాముకి అరటిపళ్ళు ఎలా ఇచ్చారు, మనీష్ నువ్వు మీవాళ్ళతో గ్రూప్ డిస్కర్షన్ పెట్టావ్ గా అంటూ నాగార్జున మనీష్ నినిలదీశారు.
అయినా మనీష్ తప్పు ఒప్పుకోవడం లేదు. వీరంతా బిగ్ బాస్ మీద పూర్తి అవహగానతో వచ్చారు, అలాగే హోస్ట్ తో గొడవ పెట్టుకుంటే హైలెట్ అవుతామని, సెలెబ్రిటీస్ ని తొక్కేసి తాము ఫేమస్ అవ్వాలని, సెలెబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో రెచ్చిపోతున్నారు. మరి ఎన్నడూ లేని విధంగా ఈసారి కామనర్స్ తో నాగార్జున గట్టిగానే పెట్టుకుంటున్నారు.
ఇక ఆదివారం ఎపిసోడ్ కి మిరాయ్ హీరో తేజ-హీరోయిన్, నిర్మాత టిజి విశ్వప్రసాద్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు.