భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మాస్ట్రో ఇళయరాజాను తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించింది. రాజకీయ నాయకులు, సినీ దిగ్గజాలు హాజరైన ఈ కార్యక్రమంలో ఇళయరాజాపై ప్రశంసల జల్లు కురిసింది. లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్‌లో ప్రతిష్టాత్మక లండన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి వాలియంట్ అనే రాజా తొలి సింఫొనీ ప్రదర్శించడం ప్రధాన హైలైట్.
ఐదు దశాబ్దాలకు పైగా తమిళ సినిమా భావోద్వేగ ధ్వనిని తన సంగీతంతో ప్రపంచానికి చాటిన గొప్ప సంగీతజ్ఞుడికి నివాళిగా ఈ కార్యక్రమం జరిగింది. ఇళయరాజా అభిమాని, ఆరాధకుడు ఉలగ నాయగన్ కమల్ హాసన్ తన ప్రశంసలు పరిహాసంతో నివాళి అర్పించారు. `ఇళయరాజా అన్నతో యాభై సంవత్సరాల విలువైన జ్ఞాపకాలను ఒక ప్రసంగంలోనే చెప్పేయడం కుదరదు` అని కమల్ భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇళయరాజాకు ఇళయజ్ఞాని (సంగీత పండితుడు) అనే బిరుదును ఎలా ఇచ్చారో కమల్ ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. ఇది తమిళ సాంస్కృతిక చరిత్రలో స్వరకర్త అత్యున్నత స్థాయికి ప్రతీక అని అన్నారు. ఈ ఇసైజ్ఞాని నా అన్నయ్య లాంటివాడు అని కమల్ అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన సిగ్నేచర్ స్టైల్ తో వేదికపై ఇళయరాజాతో తన సాన్నిహిత్యం గురించి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. రాజాతి రాజా చిత్రీకరణ సమయంలో ఇళయరాజా తనపై నమ్మకం ఉంచిన సమయాన్ని రజనీ గుర్తుచేసుకున్నాడు. ఈ చిత్రం జూబ్లీ డేను దాటకపోతే కంపోజ్ చేయడం మానేస్తానని, మళ్ళీ హార్మోనియంను తాకనని రాజా తనతో అన్నట్టు రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఇళయరాజా అందరికీ ఒకే విధంగా కంపోజ్ చేయడు.. కమల్ హాసన్ చిత్రాలకు కొంచెం అదనంగా ఏదైనా ఇస్తారని కూడా సరదాగా పరిహాసం ఆడారు రజనీ. వేదిక ఆద్యంతం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ..`` నేను ఒక ఇళయరాజా అభిమానిగా అడుగుతున్నాను. దయచేసి శాస్త్రీయ తమిళ గ్రంథాలకు స్వరపరచండి``అని అన్నారు. ఇళయరాజా పేరుతో ఏటా సంగీతకారులను గౌరవించడానికి రాష్ట్ర అవార్డును కూడా ఆయన ప్రకటించారు. భారతదేశ అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్నతో ఇళయరాజాను సత్కరించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేసారు.
ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ఇళయరాజా విశ్వవ్యాప్త ఉనికిని ప్రశంసించారు. వేర్వేరు తల్లులకు జన్మించినప్పటికీ మనం ఊపిరి పీల్చుకున్న లాలిపాటలు అన్నీ ఆయనవే. ఆయన సంగీతం లేకుండా మన యవ్వనం లేదు.. ప్రేమ లేదు..జ్ఞాపకశక్తి లేదు.. అని భావోద్వేగంగా స్పందించారు. 82 ఏళ్ల వయసులో ఇళయరాజా అచంచలమైన సృజనాత్మకతకు నిదర్శనంగా వేదికపై వాలియంట్ గురించి ప్రశంసించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు చేసిన విజ్ఞప్తి, ఇళయరాజాను సంగీతానికి శాశ్వత రాజుగా ప్రకటించారు.