Advertisement
Google Ads BL

ఇది నా ఇంట‌ర్వ్యూనా.. మీ ఇంట‌ర్వ్యూనా..


ప్ర‌తిసారీ అనుకూల‌మైన ప్ర‌శ్న‌లే ఉండ‌వు. కొన్నిసార్లు క‌టువైన‌ ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి క‌టువైన ప్ర‌శ్న ఎదురైంది ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి.. ఇటీవలే అక్షయ్ కుమార్ త‌న కొలీగ్స్‌ అర్షద్ వార్సీ,  సౌరభ్ శుక్లాతో కలిసి `జాలీ LLB 3` ట్రైలర్‌ను ఆవిష్కరించడానికి కాన్పూర్ వెళ్లారు. మీడియా స‌మావేశంలో ఒక విలేక‌రి గుట్కా ప్ర‌క‌ట‌న గురించి అక్ష‌య్ ను ప్ర‌శ్నించి ఇర్రిటేట్ చేసారు. పైగా గుట్కా వినియోగంతో కాన్పూర్ సంబంధం గురించి స‌ద‌రు విలేక‌రి ప్ర‌శ్నించారు.

Advertisement
CJ Advs

అయితే దీని గురించి అక్ష‌య్ స్పంద‌న వెంట‌నే ఆన్‌లైన్ లో వైర‌ల్ గా మారింది. ``పొగాకు తిన‌కూడ‌దు.. చెడ్డ‌ది!`` అంటూనే అక్ష‌య్ త‌న ఫేస్ ని ప‌క్క‌కు తిప్పుకుని ఎక్స్ ప్రెష‌న్ అదోలా పెట్టాడు. నెక్ట్స్ ప్ర‌శ్న ఏమిటో అడ‌గాల‌ని అన్నాడు. గుట్కా టాపిక్ ని ఏదోలా డైవ‌ర్ట్ చేసేందుకు అత‌డు చేసిన ప్ర‌య‌త్నం స్ప‌ష్ఠంగా వీడియోలో క‌నిపించింది. నహీ, నహీ... ఇంటర్వ్యూ మేరా హై యా తుమ్హారా? ఆప్ మేరే ముహ్ మే వర్డ్స్ నహీ దలేంగే... మై బోల్ రహా హూన్, గుట్కా ఖానా బురా హై... నెక్ట్స్ క్వ‌శ్చ‌న్ అని అన్నాడు. ఇది నా ఇంటర్వ్యూనా లేదా మీదా? పొగాకు నమలడం మంచిది కాదు అంతే! అని స‌రి చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇప్పుడు అక్ష‌య్ రెస్పాన్స్ చూసాక ``వావ్ ఎంత మంచి స‌మాధానం?`` అని ఒక నెటిజ‌న్ స్పందించారు. అత‌డు ఉత్త‌మ న‌టుడు! అంటూ మ‌రొక‌రు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అక్షయ్ కుమార్ - అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన జాలీ ఎల్.ఎల్.బి 3 త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాలో కామెడీ, సెటైర్, సందేశం ఆక‌ట్టుకుంటాయ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, అమృత రావు కూడా నటించారు. గజరాజ్ రావు విలన్ పాత్రలో నటించగా, సీమా బిశ్వాస్ తల్లి పాత్రను పోషించారు. రామ్ కపూర్ కూడా అతిధి పాత్రలో నటించారు.

Akshay Kumar during the press conference:

Akshay Kumar during the press conference, delivered a strong anti-tobacco message
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs