దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నేత. అయినప్పటికి తాను వైసీపీ కి జగన్ కి వీర విధేయుడిని అని చెప్పుకుని తిరుగుతున్నారు. దివ్వెల మాధురితో కలిసి ఎంజాయ్ చేస్తూ, ఇంటర్వూస్ ఇస్తూ.. సహజీవనం చెయ్యడమే కాదు అధికార మదంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను నోటికొచ్చినట్టుగా బూతులు తిట్టడంతో జగన్ వైసీపీ పార్టీ నుంచి దువ్వాడ ను సస్పెండ్ చేసారు.
కానీ దువ్వాడ మాత్రం నేను వైసీపీ నేతనే, జగన్ కి వీరాభిమానిని. నేను వైసీపీ పార్టీ నుంచే పోటీ చేస్తా కానీ వేరే పార్టీలో కలవను, పార్టీ నన్ను వద్దనుకుందేమో కానీ, నేను పార్టీని వద్దనుకోలేదు, నేను చచ్చినా పార్టీ మారనంటూ మాట్లాడుతున్నాడు. మరి వైసీపీ వద్దనుకున్నా దువ్వాడ మాత్రం వైసీపీ ని వదలడమే లేదు.
2029 లో వైసీపీ పార్టీ నుంచే దువ్వాడ పోటీ చేస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేదు కానీ నేను రెండో అమ్మాయిని చేసుకుంటే తప్పేమిటి అని మాట్లాడే దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ క్షమించి పార్టీ లోకి ఆహ్వానించి టికెట్ ఇస్తుందో, లేదో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.