గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చి బాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలున్నాయి. పెద్ది ఫస్ట్ షాట్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయ్యి ఎంత ట్రెండ్ అయ్యిందో అందరూ చూసారు. ఇక రామ్ చరణ్ పెద్ది చిత్రాన్ని చరణ్ బర్త్ డే మార్చ్ 27-2026కి రిలీజ్ అంటూ డేట్ వేసి వదిలారు మేకర్స్.
ఇప్పటికి దర్శకుడు బుచ్చిబాబు అదే తేదీ పై స్టిక్ అయ్యి ఉన్నారు. అదే రోజు హీరో నాని కూడా ద ప్యారడైజ్ ని దించేందుకు శ్రీకాంత్ ఓదెల కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చెయ్యడంతో మార్చి 27 తేదీపై అందరిలో ఓ విధమైన అంచనాలు పెరుతున్నా మరోపక్క హీరో నాని.. చరణ్ పై పోటీ కి వెళ్లడం అవసరమా అనే భావనలో ఉన్నారు.
అయితే ఇప్పుడు అదే విషయమై ఓ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. మార్చి 27 నుంచి రామ్ చరణ్ పెద్ది అయినా లేదంటే నాని ద ప్యారడైజ్ అయినా వెనక్కి తగ్గొచ్చనే టాక్ మొదలైంది. పెద్ది vs ద ప్యారడైజ్ రెండు పోటాపోటీగా మార్చ్ 27 కోసం పోటీపడుతున్నా ఫైనల్ గా ఆ తేదీ నుంచి ఏదో ఒక సినిమా అయితే తగ్గుతుంది కాదు తగ్గాల్సిందే అంటున్నారు.
సో భారీ బడ్జెట్ సినిమాలు ఒకే డేట్ కి రాకుండా ఎవరో ఒకరు వెనక్కి తగ్గినా నష్టమేమి ఉండదు. మరి ఫైనల్ గా మార్చి 27 నుంచి చరణ్, నాని లలో ఎవరు డ్రాప్ అవుతారో చూడాలి.