కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలి చిత్రం విపరీతమైన అంచనాలతో పాన్ ఇండియా మూవీ గా ఆగష్టు 14 న విడుదలై ప్రేక్షకులను ఫుల్ గా డిజప్పాయింట్ చేసింది. పాన్ ఇండియా మూవీ గనక ఆయా భాషల్లో కూలి కి ఓపెనింగ్స్ తెచ్చే ప్లాన్ లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ భాషకు క్రేజీ స్టార్ హీరో ను కూలి లో భాగం చేసారు.
తెలుగు నుంచి విలన్ గా నాగార్జున ని తీసుకొచ్చారు. హిందీ నుంచి ఆమిర్ ఖాన్ ని క్యామియో చేయించారు. కన్నడ నుంచి సౌబిన్ ని తీసుకొచ్చారు. లోకేష్ అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యింది. కూలి కి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ సినిమా ఆడియన్స్ కు నచ్ఛలేదు. అంతేకాదు నాగార్జున సైమన్ రోల్, సౌబిన్ రోల్, సూపర్ స్టార్ రోల్ తప్ప మిగతాదేవి ఆడియన్స్ కి ఎక్కలేదు.
ఆమిర్ ఖాన్ రోల్ కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అసలు ఆమిర్ ఖాన్ ఎందుకు కూలి చిత్రంలో నటించారనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఆమిర్ ఖాన్ కూడా అసలు కూలి లో నటించి పెద్ద తప్పు చేశాను అనే భావనలో ఉన్నారంటున్నారు. అసలు కూలి లో క్యామియో ఎందుకొప్పుకున్నానా అదెంత మిస్టేక్ అయ్యింది అని ఆమిర్ ఫీల్ అవుతున్నారట.
అన్నట్టు కూలి తర్వాత ఆమిర్ ఖాన్-లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. కూలి రిజల్ట్ తర్వాత ఆమిర్.. లోకేష్ తో సినిమా చేసే ఆలోచనలో లేరని టాక్ వినబడుతుంది.