రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. వారెంతగా కాదు అన్నా వారు చేసే పనులు ఆ రూమర్స్ కి ఊతమిస్తున్నాయి. సీక్రెట్ గా లంచ్ డేట్స్, డిన్నర్ ప్లాన్స్, వెకేషన్స్ అంటూ రష్మిక-విజయ్ దేవరకొండ లు దేశవిదేశాలు తెగ తిరిగేస్తున్నారు.
రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ వేడుకల్లో రష్మిక చేతికి ఉన్న స్పెషల్ ఉంగరం చూసి అందరూ రష్మిక.. సీక్రెట్ గా విజయ్ దేవరకొండ ను ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా రష్మిక తన ఎంగేజ్మెంట్ రింగ్ పై వస్తున్న వార్తలపై స్పందించింది.
తన వేలికి ఉన్న ఉంగరం నిశ్చితార్ధపు ఉంగరం కాదు, అది కేవలం నా సెంటిమెంట్ రింగ్, నాకు ఒకవేళ ఎంగేజ్మెంట్ అయితే నేను అందరికి చెబుతాను అంటూ రష్మిక మందన్న తన వెలికి ఉన్న ఉంగరం పై క్లారిటీ ఇచ్చింది.