బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసి గాయాలపాలైన ఘటన బుధవారం ముంబై లో చోటు చేసుకుంది. ముంబై లో లోకల్ ట్రైన్ ఎక్కిన కరిష్మా శర్మ ట్రైన్ స్టేషన్ లో మూవ్ అవ్వగానే అందులో నుంచి దూకెయ్యడంతో ఆమె వెన్నుముక, తలకు బలమైన గాయాలవడంతో ప్రస్తుతము ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
అసలు కరిష్మా శర్మ ట్రైన్ నుంచి దూకేయ్యడానికి కారణం.. ఆమె ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కగా.. అది కదులుతున్న సమయంలో తన స్నేహితులు ట్రైన్ ఎక్కలేదు అని గమనించి ఆమె ట్రైన్ నుంచి దూకెయ్యడంతో తలకు, వెన్నుముఖకు గాయాలవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తుంది.
తనకి MRI స్కాన్ చేసారని, కొద్దిరోజులు ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్స్ చెప్పినట్టుగా కరిష్మా శర్మ తెలిపింది. తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్దించమంటూ చెప్పుకొచ్చింది.