ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్ ఏమిటి అంటే.. కనిపించి కన్నప్పను కరుణించాడు.. వినిపించి మిరాయ్ ను నిలబెట్టాడు.. అదెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మోహన్ బాబు కోసం నటించిన ప్రభాస్ కన్నప్ప సినిమా కి బ్యాక్ బోన్ లా నిలిచారు. కన్నప్ప కు ఆ మాత్రం కలెక్షన్స్ రావడానికి ప్రభాస్ రుద్రా కేరెక్టర్ అనేది అందరికి తెలుసు.
ఇప్పుడు తేజ సజ్జ మిరాయ్ చిత్రంలో ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మిరాయ్ కథ సినిమా ఆరంభంలో వింటుంటే ఒక అటెన్షన్ వచ్చింది. వెంటనే ప్రేక్షకులు కథలో లీనమై చూసేలా ప్రభాస్ వాయిస్ ఓవర్ చేసింది అంటూ మిరాయ్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న మాట.
రాజంటే రెబలేరా.. రెబల్ అంటే రాజేరా..! అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ను తెగ పొగిడేస్తున్నారు. అయితే తేజ సజ్జ కానీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ ఎక్కడా ప్రభాస్ మిరాయ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు అనే విషయం రివీల్ చెయ్యలేదు, కానీ మిరాయ్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మిరాయ్ చూసాక ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మిరాయ్ ని కాపాడాడు అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.