సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అందాలు ఆరబోస్తూ ఉన్న హీరోయిన్స్ కూడా అవకాశాలు కోసం ఎదురు చూస్తూ అవి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందాలు ఎంతగా ఆరబోస్తున్నా వాళ్ళ సినిమాలు ప్లాప్ అయితే చాలు దర్శకులు ఎవరూ మరోసారి ఆ హీరోయిన్ వంక చూడడమే లేదు. ఎంత క్రేజ్ ఉన్నా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ లో నటించినా వరసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే ఆ హీరోయిన్స్ మళ్లీ కనిపించడమే లేదు.
మరి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకుండా, అసలు మీడియా ముందుకు రాకుండా.. లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ రెండేళ్లకో సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తే పట్టించుకుంటారా.. అదే స్వీటీ అనుష్క విషయంలో జరిగింది. అనుష్క బాగా బరువు పెరిగాక సినిమాలు చెయ్యడం తగ్గించేసింది.
ఆచి తూచి రెండేళ్లకో సినిమా చేస్తుంది. బయట పబ్లిక్ లోకి రాకుండా కేవలం స్క్రీన్ పైనే కనిపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఆ విషయం స్వీటీ ఆలోచిస్తే బెటర్. నిశ్శబ్దం, మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు తర్వాత చాలా గ్యాప్ తో ఘాటీ చేసింది. ఆడియో ఇంటర్వూస్ తో హడావిడి చేసినా ఘాటీ ని పట్టించుకోలేదు.
ఘాటీ సినిమా బాగాలేదు అంటే ప్రేక్షకులు రారు. కానీ క్రిష్ తెరకెక్కించిన ఘాటీకి ఓపెనింగ్స్ లేవు అంటే అనుష్క క్రేజ్ తగ్గింది అనే చెప్పక తప్పదు. ఈ విషయంలో అనుష్క ఆలోచన చేస్తే బెటర్ ఏమో అంటూ ఆమె అభిమానులే సలహాలిస్తున్నారు.