సమంత గత రెండేళ్లుగా సినిమాలు చెయ్యలేదు, ఆమె సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ సమంత క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. సోషల్ మీడియాలో సమంత పై విపరీతమైన అభిమానం కనిపిస్తూనే ఉంటుంది. ఆమె ఫోటో షూట్స్ కావొచ్చు, లేదంటే పర్సనల్ విషయాల్లో అయినా.. ఎప్పుడు వార్తల్లో నిలిచే పేరు సమంత ది.
రీసెంట్ గా సమంత సక్సెస్ అంటే సినిమాలు చెయ్యడమే, బాక్సాఫీసు నెంబర్లు వెంట పరిగెత్తడమే అనుకున్నాను, టాప్ 10 జాబితాలో ఉండేందుకు కష్టపడేదాన్ని, కానీ నేను ఇప్పుడు 1000 కోట్ల సినిమాలు చెయ్యకపోయినా క్రేజీగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. నేను సినిమాలు చెయ్యకపోయినా నన్ను అభిమానిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా సమంత షేర్ చేసిన పిక్ చూస్తే వావ్ స్వీట్ అండ్ సింపుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. నిజంగానే సమంత అలా స్మైల్ చేస్తూ సింపుల్ గా కనిపించినా చాలా హ్యాపీ గా స్వీట్ లుక్స్ తో చితక్కొట్టేసింది.