బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఈ సీజన్ మొదటి వారం ఎలా నడుస్తుందో అనుకుంటే కామనర్స్ vs సెలబ్రిటీస్ అంటూ బిగ్ బాస్ విభజించి పాలిస్తున్నాడు. సెలెబ్రిటీస్ ని టెన్నెట్స్ గాను, కామనర్స్ ని ఓనర్స్ గా ట్రీట్ చేస్తూ.. సెలబ్రిటీస్ కి కడుపునిండా ఫుడ్ కూడా పెట్టడం లేదు.
ఇక ఈ వారం హౌస్ లో గుడ్డు గోల పెద్ద రచ్చ క్రియేట్ చేసింది. నేను గ్రూప్ గేమ్ ఆడను అంటే నేను గ్రూప్ గేమ్ ఆడను అంటూ కామనర్స్ కొట్టుకుచస్తున్నారు. ఇక ఈ హౌస్ లో సంజన గల్రాని పై డే 1 నుంచి బయట నెగిటివిటి మొదలయ్యింది. ఆమె బిహేవియర్ ని బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు చీల్చి చెండాడుతున్నారు.
మరోపక్క బిగ్ బాస్ సంజనను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఓ ఐదుగురిని కెప్టెన్సీ కి సెలెక్ట్ చెయ్యమంటే సంజన తనతో పాటుగా మరో నలుగురు ఇమ్మాన్యువల్, శ్రీష్టి వర్మ, అలాగే కామనర్స్ లో పవన్, మాస్క్ మ్యాన్ లను సెలెక్ట్ చేసింది. ఈ టాస్క్ లో తమకు సపోర్ట్ గా ఎంచుకున్న మరో ఐదుగురు వీళ్ళను కెప్టెన్సీ గా చేసేందుకు సపోర్ట్ చేస్తూ టాస్క్ ఆడారు.
ఈ టాస్క్ లో సంజన ను కామన్ మ్యాన్ గెలిపించింది. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్సీని సంజన సొంతం చేసుకుంది. అలాగే సంజన నే ఈ వారం హైయ్యెస్ట్ నామినేషన్స్ లో ఉంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.