భైరవం తర్వాత మూడు నెలలు తిరక్కుండానే బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి అంటూ థియేటర్స్ లో సందడి చేయడానికి దిగిపోయాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కిందపురి నేడు సెప్టెంబర్ 12 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మీడియాకి ఒకరోజు ముందే ప్రీమియర్ షోస్ వేసెయ్యడంతో అందరూ సోషల్ మీడియాలో కిష్కిందపురి పై తన రియాక్షన్ ని ట్వీట్లు రూపంలో చూపిస్తున్నారు.
ప్రేమికులైన రాఘవ్-మైథిలి(బెల్లంకొండ-అనుపమ) లు థ్రిల్ కోసం ఘోస్ట్ వాకింగ్ అంటూ టూర్స్ ని నిర్వహిస్తూ ఉంటారు. అందుకోసం పాడుబడ్డ బంగ్లాలను ఎంచుకుంటారు. కిష్కిందపురి అనే ఊరిలో సువర్ణమయ అనే రేడియో స్టేషన్ కి కొంతమందిని రాఘవ్-మైథిలి లు థ్రిల్ కోసం తీసుకెళతారు.. ఆ తర్వాత అక్కడ ఏమైంది, ఆ రేడియో స్టేషన్ లో ఏం జరిగింది అనేది కిష్కిందపురి షార్ట్ స్టోరీ.
థ్రిల్లింగ్ స్టోరీస్ కి క్షణక్షణం ట్విస్ట్ లతో భయాన్ని పరిచయం చెయ్యడమే కీలకం. ఫస్ట్ హాఫ్ లో అలాంటి భయాన్ని చూపించారు, సెకండ్ హాఫ్ లో లాజిక్ లేని థ్రిల్లింగ్ అంతగా ఆకట్టుకోదు, ఫస్ట్ హాఫ్ విజువల్స్, BGM అన్ని సెట్ అయ్యాయి, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోవు.
బెల్లంకొండ శ్రీనివాస్ పెరఫార్మెన్స్, అనుపమ కేరెక్టర్, BGM, సినిమాటోగ్రఫీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, బెల్లంకొండ-అనుపమ కెమిస్ట్రీ అన్ని కిష్కిందపురికి ప్లస్ పాయింట్స్. కథ బావున్నా స్క్రీన్ ప్లే పై దర్శకుడు మరికాస్త శ్రద్ద పెట్టి ఉంటే బావుండేది, దర్శకుడు సెకండ్ హాఫ్ ని పట్టించుకోలేదు, ఈ సినిమాకి అదే వీక్ అనే మాట సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది.