హనుమాన్ హిట్ తర్వాత కుర్ర హీరో తేజ సజ్జ చేస్తున్న మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరగడమే కాదు.. మిరాయ్ అంటూ ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఆ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. మంచు మనోజ్ విలన్ గా కనిపించడం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద సంస్థ సినిమాని నిర్మించడం, కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా తెరకెక్కించిన మిరాయ్ పై అంచనాలు మొదలయ్యాయి. పాన్ ఇండియా మార్కెట్ లో భారీ ప్రమోషన్స్ మధ్యన నేడు విడుదలవుతున్న మిరాయ్ ఓవర్సీస్ షోస్ పూర్తి కావడంతో సినిమాపై తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్...
మిరాయ్ ఓవర్సీస్ టాక్
సినిమా చాలా స్లోగా మొదలై.. ఊహించని విధంగా పుంజుకొన్నది, మిరాయ్ సినిమా ఫస్టాఫ్ చూస్తే అద్బుతమైన దృశ్య కావ్యంగా ఉంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా మరో హిట్ కొట్టేసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది, సెకండాఫ్ విజువల్ ట్రీట్, హరి గవ్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు.
సినిమా బావుంది.. ఇంట్రో, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సూపర్బ్ గా ఉన్నాయ్, VFX అండ్ క్లైమాక్స్ లో రాముడికి కనెక్ట్ చేసిన సీన్స్ బావున్నాయి, కాకపోతే ట్రెండ్ అయిన వైబ్ ఉంది సాంగ్ సినిమాలో లేకుండా చేసారు, అది డిజప్పాయింట్ చేసింది, అలాగే సెకండ్ పార్ట్ లీడ్ అయితే అద్దిరిపోయింది అంటూ యుఎస్ ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు.
సినిమా స్కేల్, విజువల్స్ బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ను పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విధ్వంసం సృష్టిస్తుంది. మిరాయ్ సినిమా తెలుగు మూవీస్‌లో గొప్ప ఎక్స్‌పీరియెన్స్. కార్తీక్ పెట్టిన ఫ్రేమ్స్ బాగున్నాయి.. అంటూ మరికొందరు ఆడియన్స్ స్పందిస్తున్నారు.
మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్. తేజా సజ్జ అద్దిరిపోయే సినిమాని అందించాడు. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌కి ఎమోషన్స్ తో కట్టిపడేసే సినిమా.. సెకండాఫ్‌లో 15 నిమిషాల కామెడీ తీసేస్తే.. సినిమా ఈజీగా బ్లాక్ బస్టర్ అయ్యేది.. అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు. ఫైనల్ గా తేజ సజ్జ మిరాయ్ థియేటర్స్ కి ఊపు తెచ్చింది, ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే అంటూ మరికొందరు ఆడియన్స్ ట్వీట్లు పెడుతున్నారు.