నిజమే ఆ డైరెక్టర్ ని నమ్మి మరొక్క ఛాన్స్ ఇచ్చే దమ్ము ఏ హీరోకైనా ఉందా.. అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. ఆయన తెరకెక్కించిన సినిమాలకు తెలుగు నుంచి హిందీ వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సినిమా తీస్తున్నారు అంటే ఆ తమిళ తంబిలకు కూడా ఆయన సినిమాలు నచ్చట్లేదు. ఆయనెవరో కాదు ఒకప్పటి టాప్ డైరెక్టర్ మురుగదాస్.
మహేష్ తో చేసిన స్పైడర్ తో స్టార్ట్ అయిన ఆయన ప్లాప్ ల పరంపర ఇప్పుడు మదరాసి వరకు నడుస్తూనే ఉంది. మహేష్ కి స్పైడర్ తో కోలుకోలేని షాకిచ్చిన మురుగదాస్ ఆతర్వాత సూపర్ స్టార్ కి దర్బార్, విజయ్ కి సర్కార్ లాంటి కళాకండాలు అందించారు. ఆ దెబ్బకు బాగా గ్యాప్ వచ్చినా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పిలిచి సికిందర్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక సికిందర్ ఫలితాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు.
ఇప్పుడు శివ కార్తికేయన్ తో మదరాసి సినిమాని తెరకెక్కించారు. ఆ చిత్రానికి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ కూడా రాలేదు. అంటే సినిమా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినట్లే. కొన్ని శివ కార్తికేయన్ పెరఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్ బావున్నప్పటికి.. ఇల్లాజికల్ సీన్స్, మురుగదాస్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ ప్లాట్ అన్ని మదరాసి కి మైనస్ గా మారడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు.
మరి వరస డిజాస్టర్స్ లు ఇస్తున్న మురుగదాస్ ని నమ్మి ఏ హీరో అవకాశం ఇస్తాడో, అసలు అలా అఫర్ ఇచ్చే దమ్ము మరో హీరోకి ఉందా అనేది నెటిజెన్స్ చేస్తున్న కామెంట్.