కన్నడ లో తెరకెక్కి సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ గా నిలిచిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. భారీ అంచనాలతో కాంతార 1 ని రిషబ్ శెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకొ స్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు అలాగే నార్త్ ఇలా ప్రతి భాషలోనూ క్రేజీ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది.
ఇక ఈ చిత్రాన్ని నేషనల్ కాదు కాదు ఇంటెర్నేషనల్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. దానితో కాంతార 1పై భీబత్సమైన హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా కాంతార 1 కి కత్తిలాంటి ఓటీటీ డీల్ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కాంతార 1ఓటీటీ హక్కులను భారీ డీల్ తో సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
కాంతారా 1ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు అన్ని భాషలకు కలిపి కళ్ళు చెదిరే డీల్ అంటే దాదాపుగా 125 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈవిషయంలో రకరకాల న్యూస్ లు వినిపించినా ప్రస్తుతం కాంతార 1 క్రేజీ ఓటీటీ డీల్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.