ప్రస్తుతం హీరోయిన్ హన్సిక తన భర్త సోహెల్ తో విడిపోతుంది అనే ప్రచారం జరుగుతుంది. భర్త తో హన్సిక విడాకులు తీసుకోబోతుంది అనే ప్రచారాన్ని ఆమె సోషల్ మీడియాలో నిజం చేస్తుంది. రీసెంట్ గా ఒంటరిగా వినాయకచవితి పూజ చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఇప్పుడు హన్సిక మరో సమస్యలో ఇరుక్కుంది. అది హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ హన్సిక ఫ్యామిలీ పై గృహ హింస కేసు పెట్టింది. ప్రశాంత్ మోత్వానీ - ముస్కాన్ లు 2020 లో వివాహం చేసుకుని, 2022 లో విభేదాలతో విడిపోయిన సమయంలో ముస్కాన్ హన్సిక, హన్సిక తల్లి జ్యోతి, అలాగే భర్త పై గృహ హింస కేసు పెట్టింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హన్సిక, ఆమె తల్లి జ్యోతి లకు ముంబయి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆతర్వాత తమ పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు హన్సిక కు షాకిస్తూ వారు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది.