కింగ్ నాగార్జున పై సోనియా ఆకుల ఇంకా ఇంకా విమర్శలు చేస్తూనే ఉంది. గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆకుల పై పబ్లిక్ లో విపరీతమైన నెగిటివిటీని బిగ్ బాస్ హౌస్ మూటగట్టుకుంది. చిన్నోడు-పెద్దోడు అంటూ నిఖిల్-పృథ్వీ లను తన వెనుకే తిప్పుకున్న సోనియా వాళ్ళను అడ్డుపెట్టుకుని ఆడిట్లుగా చూపించారు. అదే ఆమె తీసుకోలేకపోయింది.
అంతేకాకుండా హోస్ట్ నాగార్జున ఆమెను వీకెండ్ ఎపిసోడ్స్ లో బ్లేమ్ చెయ్యడం సోనియా ఆకుల ని నెగెటివ్ అయ్యేలా చేసింది. ఆమె తప్పులను నాగార్జున ఎత్తి చూపడం పై సోనియా ఆకుల విమర్శలు చేస్తుంది. తన తప్పేమి లేకపోయినా తప్పు ఉంది అని చూపించేలా నాగార్జున చేసారు, ఆయన హోస్ట్ కింద పనికి రారు అంటూ పదే పదే సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యాక కూడా సోనియా ఆకుల నాగార్జున పై విమర్శలు చేయడం మానలేదు. ఆమె రీసెంట్ గా మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో జరిగింది చూపించారు, వాళ్లకు కావాల్సింది మాత్రమే చూపిస్తారు. నాగర్జున గారు కూడా మన తప్పులను చూపిస్తారు కానీ మనం చెప్పేది వినరు, నేను చెయ్యి పైకెత్తి మాట్లాడతాను అన్నా పట్టించుకోలేదు. వీకెండ్ ఎపిసోడ్ లో మనం చేసే తప్పులను నాగ్ చూపిస్తారు అని చెప్పారు. కానీ నేను మూడోవారంలో ఎలిమినేట్ అయ్యేవరకు నాకు తెలియలేదు బిగ్ బాస్ అనేది ఒక వేస్ట్ షో అంటూ సోనియా ఆకుల అటు బిగ్ బాస్ ఇటు నాగ్ పై తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.