బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఇంకా ఓ వారం కాలేదు.. అప్పుడే హౌస్ లో కంటెస్టెంట్స్ మద్యన గొడవలు తారస్థాయిలో మొదలయ్యాయి. హౌస్ లో ఉండాలంటే రచ్చ చెయ్యాలి ఇదే కాన్సెప్ట్ తో ఈసారి సీజన్ కి కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. సెలెబ్రిటీస్ vs కామన్ మ్యాన్స్ అంటూ ఏదో కొత్తగా ట్రై చేసారు.
ఇక టెన్నెట్స్ - ఓనర్స్ అంటూ లగ్జరీ హౌస్, అవుట్ హౌస్ అంటూ సెలబ్రిటీస్ టెన్నెట్స్ గా ఉంటే.. కామన్ మ్యాన్స్ అవుట్ హౌస్ లో ఉన్నారు. ఈసారి పెద్దగా తెలిసిన మొహాలేవీ హౌస్ లో లేవు. మాజీ మాజీ హీరోయిన్స్ ఆశ షైనీ, సంజన, సుమన్ శెట్టి లాంటి వాళ్ళు, రీతూ చౌదరి జానీ మాస్టర్ కేసు విషయంలో ఫేమస్ అయిన శ్రిష్టి శర్మ, నటుడు భరణి, కమెడియన్ ఇమ్మాన్యువల్ తప్ప పెద్దగా తెలిసిన వారెవరూ హౌస్ లో లేరు.
ఇక గత రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ లో గుడ్డు గోల చూస్తే ఛి ఛి అంటారు. ఎపిసోడ్ మొత్తం గుడ్డు కొట్టేసి తినేసిన సంజన చేసిన ఓవరాక్షన్ చూస్తే ప్రేక్షకులకు చిరాకు రాక మానదు. భరణి, సంజన వీళ్లంతా ఓనర్స్ ని ఇబ్బంది పెట్టెలా ప్లాన్ చేసిన విషయం తెలియక రీతూ చౌదరి, శ్రిష్టి లు రియాక్ట్ అవడం అబ్బో హౌస్ మొత్తం గందరగోళంగా రచ్చ రచ్చగా తయారైంది.
అసలు బిగ్ బాస్ 9 లో ఈ ఎపిసోడ్ చూసాక ఎవరూ మరోసారి బిగ్ బాస్ చూసే సాహసం కూడా చేయరేమో.