మాయోసైటిస్ బారిన పడిన తర్వాత లైఫ్ లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలిసింది అంటూ ఈమధ్యన సమంత ఓ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఒక్కప్పుడు సక్సెస్ అంటే వరసగా సినిమాలు చెయ్యడమే అనుకునేదాన్ని, భారీ బడ్జెట్ మూవీస్, బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించాలి అదే సక్సెస్, టాప్ 10 లిస్ట్ లో ఉండాలని తహతహలాడేదాన్ని అంటూ సమంత చెప్పుకొచ్చింది.
కానీ ఇప్పుడు అలా ఆలోచించడం మానేసాను, నా సినిమాలు రెండేళ్లుగా రిలీజ్ అవలేదు, నా దగ్గర 1000 కోట్ల సినిమా లేదు అయినా చాలా హ్యాపీ గా ఉన్నాను, గతంలో అయితే నా సినిమా విడుదలైనా, లేదంటే ప్రతి శుక్రవారం విడుదలవుతున్న సినిమాలు చూసి నెంబర్లు వెంట పరుగులు పెట్టేదాన్ని, శుక్రవారం వస్తుంది అంటే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు.
నా ఫాలోవర్స్ చాలామంది నా గ్లామర్, నా ఫోటోషూట్స్, సినిమాల వల్లే నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. వారికోసం నేను కొన్నాళ్ల నుంచి హెల్త్ పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్నాను. హెల్త్ కి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఎక్కడో వెతికే అవసరం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సమంత శుక్రవారం నంబర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.