తేజ సజ్జ మిరాయ్-బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి చిత్రాలు సెప్టెంబర్ 12 అంటే రేపు శుక్రవారం పోటీపడుతున్నాయి. హనుమాన్ సక్సెస్ అలాగే మిరాయ్ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో తేజ సజ్జ రోజు మీడియాలో హైలెట్ అవుతున్నాడు. ఎక్కడ చూసినా తేజ సజ్జనే కనిపిస్తున్నాడు. మీడియాతో ఇంటరాక్షన్స్, విలన్ మంచు మనోజ్ ఇంటర్వూస్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు.
అందులోను మిరాయ్ నిర్మాణ సంస్థ పెద్ద బ్యానర్ కావడం, తేజ సజ్జ ముంబై, చెన్నై, బెంగుళూరు అంటూ ప్రమోషన్స్ తో దుమ్మురేపడం మిరాయ్ కి కలిసొచ్చే అంశం.
అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కిష్కిందపురి ప్రమోషన్స్ తో చాలా కష్టపడుతున్నాడు. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ప్రమోట్ చేస్తున్నాడు. భైరవం చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా అందులో బెల్లంకొండ శ్రీనివాస్ పెరఫార్మెన్స్ హైలెట్ అయ్యింది. ఇప్పుడు కూడా కిష్కిందపురి ప్రీమియర్స్ చూసిన వారు సినిమా చాలా బావుంది అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
మరి రేపు టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మిరాయ్ తేజ సజ్జ గెలుస్తాడా, లేదంటే కిష్కిందపురి తో బెల్లంకొండ గెలుస్తాడా, లేదంటే రెండు సినిమాలూ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాయా అనేది మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.