కర్లీ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ కిష్కిందపురి తో భయపెట్టేందుకు రెడీ అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అనుపమ నటించిన కిష్కిందపురి రేపు శుక్రవారం సెప్టెంబర్ 12 న విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో అనుపమ, బెల్లంకొండలు చాలా బిజీగా వున్నారు.
రీసెంట్ గా కిష్కిందపురి ఈవెంట్ కి అనుపమ వైరల్ ఫీవర్ తోనే హాజరు కావడం తో ఆమెకు సినిమాపై ఉన్న డెడికేషన్ ఎలాంటిదో తేటలతెల్లమైంది. అయితే అనుపమ పరమేశ్వరన్ విజయాలకు ఈమధ్యన పరదా చిత్రం అడ్డుపడింది. అనుపమ పరమేశ్వరన్ మొదటిసారిగా చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం పరదా పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.
పరదా చిత్రానికి కూడా అనుపమ చాలా డెడికేషన్ తో ప్రమోషన్స్ చేసింది. పరదా సక్సెస్ అవుతుంది అని అనుపమ పరమేశ్వరన్ చాలా హోప్స్ పెట్టుకుంది.. కానీ పరదా రిజల్ట్ ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు అనుపమ హోప్స్ అన్ని కిష్కిందపురి మీదే ఉంది. చూద్దాం కిష్కిందపురి అనుపమకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.