ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు సంజయ్ పూర్ ఇటీవల లండన్ లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 10,000 కోట్లు పైగా నికర ఆస్తులు ఉన్న సోనా కామ్ సంస్థలకు అతడు అధిపతి అంటూ ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఈ ఆస్తుల కోసం అతడి ఇంట్లో గొడవలు ముదిరిపాకాన పడుతున్నాయి. కోర్టు వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. సంజయ్ ముగ్గురు భార్యల్లో రెండో భార్య కరిష్మాకపూర్ ...దివంగత కపూర్ ప్రస్తుత భార్య అయిన ప్రియా సచ్ దేవ్ పై న్యాయపోరాటానికి దిగారు. కరిష్మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు తమ తండ్రి ఆస్తిలో వాటా కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసారు.
సంజయ్ కపూర్ మరణం తర్వాత ప్రియా సచ్ దేవ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, ఆమె నకిలీ వీలునామా సృష్టించి మొత్తం ఆస్తిని కొట్టేయాలని చూస్తోందని మాజీ భార్య కరిష్మా ఆరోపించారు. తన పిల్లల వాటా న్యాయబద్ధంగా రావాల్సిందేనని పోరాటానికి దిగుతున్నారు. అయితే కోర్టు తాజా విచారణలో ప్రియా సచ్ దేవ్ దీనికి కౌంటర్ సమర్పించాలని, అలాగే సంజయ్ కి చెందిన సోనా కామ్ సంస్థ ఆస్తులను ప్రకటించాలని కూడా కోరింది.
వాదోపవాదనల నడుమ ప్రియా సచ్ దేవ్ తరపు న్యాయవాది వ్యాఖ్యానిస్తూ, కరిష్మా పిల్లలకు సంజయ్ ట్రస్ట్ నుంచి 1900కోట్ల ఆస్తులను రాసిచ్చారని, రోడ్డున వదిలేయలేదని పేర్కొన్నారు. ఆమె ఏడుపు దేనికి? కొన్నేళ్లుగా కనిపించని వారు ఇప్పుడే ఎందుకు వచ్చారు? అని కూడా ప్రియా న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసులో తదుపరి కోర్టు విచారణ అక్టోబర్ 9న జరగనుంది.