మంచు అన్నదమ్ములైన మంచు విష్ణు, మంచు మనోజ్ ల నడుమ ఆస్తి వ్యవహారాలు రచ్చకెక్కాయి. నడిరోడ్డుపై కొట్టుకోబోయారు. మోహన్ బాబు కూడా పెద్ద కొడుకు విష్ణు పక్షాన నిలబడి మనోజ్ ను వ్యతిరేఖించారు. అంత రచ్చ జరిగినాక మోహన్ బాబు, మంచు విష్ణు, అలాగే విష్ణు కుమార్తెలు, కొడుకు అవరామ్ నటించిన కన్నప్ప విడుదలకు ముందు, విడుదలయ్యాక మంచు మనోజ్ ట్వీట్లు వేసాడు.
కన్నప్ప మొదటిరోజు మొదటి షో చూసి అన్న విష్ణు నటనను పొగిడాడు. రీసెంట్ గా సంతోషం అవార్డ్స్ లో కన్నప్ప కు అవార్డు వచ్చింది. అప్పుడు మంచు మనోజ్ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసాడు. గొడవలను పక్కనపెట్టి మంచు మనోజ్ విష్ణు కన్నప్ప కోసం ట్వీట్లు పెట్టాడు.
మరి రేపు శుక్రవారం మనోజ్ నటించిన మిరాయ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమ్ముడు మంచు మనోజ్ నటించిన మిరాయ్ కోసం మంచు విష్ణు విష్ చేస్తూ ట్వీట్ చేస్తాడా.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి మిరాయ్ విజయం కోసం మంచు విష్ణు ప్రైస్ చేస్తాడా.. లేదో.. చూద్దాం.