నయనతార బయోపిక్ గా తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్ లో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని 3 సెకన్ల సన్నివేశాన్ని ఉపయోగించారని హీరో ధనుష్ ఆరోపించడమే కాదు.. తన అనుమతి లేకుండా వాడిన సీన్‌ను 24 గంటల్లోగా తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధనుష్ హెచ్చరించాడు.
అయితే నయనతార-నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఆ సీన్ మాత్రం తొలగించకపోవడంతో ధనుష్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు.. అప్పట్లో ధనుష్ vs నయనతార వివాదం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికి ఆ కేసు నడుస్తుంది.
తాజాగా నయనతార మెడకు మరో వివాదం చుట్టుకుంది. నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్ లో నయనతార నటించిన చంద్రముఖి చిత్రం లోని కొన్ని సన్నివేశాలు అనుమతి లేకుండా వాడారు అంటూ చంద్రముఖి మేకర్స్ కేసు పెట్టారు. ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ, డాక్యుమెంటరీ నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ మరియు నయనతారపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.
ఈ కేసులో నయనతార మరియు నెట్‌ఫ్లిక్స్ కి హైకోర్టు నోటీసు లు ఇస్తూ ఈ కేసులో తమ స్పందనను రెండు వారాల్లోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.