అక్కినేని కోడలు జైనాబ్ రావూజీ పరిచయం అవసరం లేదు. హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మ్యాగ్నెట్ కుమార్తె రావూజీ. దిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన కుటుంబం ఇది. అక్కినేని అఖిల్ - జైనాబ్ రెండేళ్ల పాటు డేటింగ్ చేసాక పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు.
అయితే జైనాబ్ పెళ్లి తర్వాత తన మొదటి బర్త్ డే ను సెప్టెంబర్ 9న జరుపుకున్నారు. ఈ బర్త్ డే వేడుకలను అక్కినేని కుటుంబం అంగరంగ వైభవంగా నిర్వహించింది. దీనికోసం ఒక ప్రత్యేక వెన్యూలో ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలతో రక్తి కట్టించారని సమాచారం. వేడుకల్లో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ చాలా సందడిగా కనిపించారు.
వయసు వ్యత్యాసం:
అఖిల్- జైనాబ్ పెళ్లి అనంతరం ఈ జంట వయసు వ్యత్యాసం గురించి చాలా గుసగుసలు వినిపించాయి. అఖిల్ అక్కినేని వయసు 30 సంవత్సరాలు కాగా, అతడి భార్య జైనాబ్ రావూజీ వయసు 39 సంవత్సరాలు అని టాక్ వినిపించింది. జైనాబ్ సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక కళాకారిణి. ఆమె నటి, రచయిత. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తుంటారు. జైనాబ్ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావూజీ కుమార్తె.