Advertisement
Google Ads BL

విషం ఇచ్చి చంపెయ్యండి - కన్నడ హీరో


కన్నడ హీరో దర్శన్.. అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ప్రస్తుతం పరప్పన ఆగ్రహం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తన స్నేహితురాలు పవిత్ర గౌడ కోసం రేణుకస్వామిని సుపారీ ఇచ్చి హత్య చేయించిన కేసులో దర్శన్ జైలులో ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం  దర్శన్ కు అనారోగ్య కారణాల దృష్యా హైకోర్టు బెయిల్ మంజూరు చెయ్యగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చెయ్యడంతో సుప్రీంకోర్టు దర్శన్ ను వెంటనే కష్టడీలోకి తీసుకోవాలి అంటూ సెన్సేషనల్ తీర్పు చెప్పింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉన్న దర్శన్ విచారణ కోసం సిటీ సివిల్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. అయితే తాను పరప్పన అగ్రహార జైలులో ఉండలేకపోతున్నాను, అక్కడ వాసన భరించలేకపోతున్నాను, చాలా రోజులుగా సూర్యుడిని చూడలేదు, గదిలో బట్టలు వాసన వస్తున్నాయి..

ఈ జైలులో సరైన వసతులు లేవు, ఫంగస్ తీవ్రత భయపెడుతుంది. ఇలాంటి స్థితిలో నేను ఉండలేను, కాస్త విషమివ్వండి, ఇక్కడ ఈ జైలులో జీవించలేను అంటూ దర్శన్ న్యాయమూర్తి ముందు మొరపెట్టుకున్నాడు. ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన దర్శన్ కొన్నాళ్ళు  జైలులోను రాచమర్యాదలు అందుకున్నాడు, ఆ విషయం బయటికి రావడంతో అతను ఇప్పుడు ఇలాంటి జైలులో కష్టపడాల్సి వస్తుంది. 

Please give me poiso-Darshan :

Darshan Urges Poison As Court Rejects Jail Transfer Plea
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs