మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలంటూ సినిమాలకు బ్రేకిచ్చి మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాక ఆయన లుక్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు. గాడ్ ఫాదర్, ఆచార్య, భోళా శంకర్ ఇలా ఈ సినిమాల్లో చిరు లుక్స్ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రం మెగాస్టార్ ని వింటేజ్ స్టయిల్లోకి మార్చేశారు. మన శంకర వరప్రసాద్ గారు లో చిరు స్టైలిష్ లుక్, వింటేజ్ లుక్ ఇప్పటికే చిరు బర్త్ డే టీజర్ లో చూసి మెగా ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్స్ అయ్యారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో మన శంకర్ వరప్రసాద్ గారు స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతుంది. చిరు-నయనతార పై అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సాంగ్ పై మేకర్స్ హైప్ క్రియేట్ చెయ్యడమే కాదు.. ఆ సాంగ్ లో మెగాస్టార్ చిరు లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా శంకర వర ప్రసాద్ గారు సెట్ నుంచి బయటికొచ్చిన చిరు లుక్ చూసి What a mega mesmerizing look sir ji... Mind blowing anthe 😍 పండగకి కొత్త బట్టలు, కొత్త వంటలు కామన్ గా ఉంటాయి. రాబోయే సంక్రాంతికి మా శంకర వరప్రసాద్ గారు సృష్టించే కొత్త రికార్డులు కన్ఫర్మ్ గా ఉంటాయి అంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో కామెంట్లు పెడుతున్నారు.
ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న మెగా-అనిల్ మూవీలో వెంకటేష్ క్యామియో చెయ్యబోతున్నారు. ఆయన పాత్రకు సంబందించిన షూట్ ఈ నెలలోనే జరగబోతుంది అని తెలుస్తుంది. నవంబర్ కల్లా షూటింగ్ చక్కబెట్టేసి సంక్రాంతికి కూల్ గా శంకర వరప్రసాద్ గారు ని దించే ఆలోచనలో అనిల్ రావిపూడి చకచకా పనులు చక్కబెట్టేస్తున్నాడు.