భగవంత్ కేసరి తర్వాత టాలీవుడ్ లో కనిపించని చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. అయితే కాజల్ కి యాక్సిడెంట్ అయ్యింది అనే వార్త నిన్న సోమవారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో ఆందోళన పడిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
అయితే తనకు యాక్సిడెంట్ అయ్యింది అనే వార్తలు కాజల్ వరకు వెళ్లడంతో.. అభిమానులు ఆందోళన పడుతున్నారని తెలిసి ఆమె ఇమ్మిడియట్ గా రియాక్ట్ అయ్యింది. నాకు యాక్సిడెంట్ అయ్యింది అనే వార్తలు నా దృష్టికి వచ్చాయి. నాకేమి అవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆ వార్తలు చూసి నేను నవ్వుకున్నాను.
ఎందుకంటే ఇంతకంటే ఫన్నీ న్యూస్ మరొకటి ఉండదు, దేవుడి దయవల్ల నాకేమి కాలేదు, నేను క్షేమంగానే ఉన్నాను, ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చెయ్యొద్దు అని మనవి చేసుకుంటున్నాను అంటూ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తనకు యాక్సిడెంట్ అయ్యింది అనే వార్తలపై రియాక్ట్ అయ్యింది.