ఆమె ప్రముఖ నటి.. అతడు ప్రముఖ నిర్మాత.. ఆ ఇద్దరూ కలిసి సినిమాలకు పని చేసారు. నాలుగైదు సినిమాల పరిచయం తర్వాత అతడు ఈ నటికి ప్రపోజ్ చేయడం ప్రారంభించాడు. తన వెంట పడుతున్న నిర్మాతతో ఆరు నెలలు పైగానే మాట్లాడటం కూడా మానేసింది సదరు హీరోయిన్. చాలా తిరస్కరణల తర్వాత చివరికి అప్పటికే పెళ్లయిన అతడికి ఓకే చెప్పింది. ఆ ఇద్దరూ పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. సీక్రెట్‌గా పెళ్లాడేసారు. ఆ తర్వాత యథావిధిగా ఆ నిర్మాత ఫ్యామిలీలో గొడవలు పరాకాష్ఠకు చేరుకున్నాయి.
ఈ కథంతా ఎవరి గురించి అంటే... అగ్ర కథానాయికగా సౌత్, నార్త్ ని ఏలిన మేటి కథానాయిక శ్రీదేవి, తన భర్త బోనీకపూర్ గురించిన స్టోరి ఇది. అయితే శ్రీదేవి దుబాయ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుక కోసం వెళ్లి బాత్రూమ్ లో కాలు జారి నీళ్లలో మునిగి ఊపిరాడక చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పోలీస్ విచారణలోను ఇదే నిజమని ప్రకటించినా అభిమానులు దీనిని నమ్మలేదు.
అదంతా అటుంచితే శ్రీదేవి మరణానికి ముందు `మామ్` అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి డెడికేషన్ గురించి బోనీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. విదేశాలలో ఒక షెడ్యూల్ కోసం వెళ్లినప్పుడు తామిద్దరూ ఒకే గదిలో ఉండాలన్న ప్రపోజల్ ని శ్రీదేవి తిరస్కరించారని, తనను అక్కడ షూటింగ్ చేసినంత కలం దూరం పెట్టిందని బోనీ తెలిపారు. తాను `అమ్మ` పాత్రలో నటిస్తున్నారు. అందువల్ల ఆ పాత్రలో ఉన్నప్పుడు తనతో ఉండటం కుదరదని అన్నారట. అందుకే తామిద్దరూ ఒకే గదిలో ఉండడం కుదరలేదని బోనీకపూర్ బోల్డ్ గా చెప్పారు. అలాగే మలయాళ డబ్బింగ్ విషయంలో ఒక డబ్బింగ్ ఆర్టిస్టు సమక్షంలోనే శ్రీదేవి డబ్బింగ్ చెప్పారని, అలా అంకితభావంతో పని చేసే నటీమణులు అరుదుగా ఉంటారని కూడా బోనీ అన్నారు. శ్రీదేవి నటించిన ఐదారు సినిమాలు హిందీలోకి అనువాదమయ్యాక, నటిగా మొదలైనప్పుడు తనకు భాష రాకపోతే హిందీ పరిశ్రమలో కుదరదని భావించి వెంటనే ఒక టీచర్ ని నియమించుకుని శ్రీదేవి హిందీ నేర్చుకున్నారని తెలిపారు.