మెగా ఫ్యామిలిలో గొడవలు.. మెగా vs అల్లు ఫ్యామిలీస్ అంటూ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది. మెగా అకేషన్ లో అల్లు వాళ్ళు కనిపించకపోయినా, అల్లు అకేషన్ లో మెగా ఫ్యామిలీ కనిపించకపోయినా.. మెగా హీరోల బర్త్ డే లకు అల్లు అర్జున్ ట్వీట్ వేయకపోయినా అదేదో వరల్డ్ వార్ అన్నట్టుగా మాట్లాడేసుకుంటారు.
ఈమధ్యన అల్లు అరవింద్ తల్లి కనకరత్నం గారు వయసురీత్యా వచ్చిన వృద్ధాప్యంతో కన్ను మూసారు. ఆ సమయంలో పవన్ వైజాగ్ లో ఉన్నారు. తన మీటింగ్ ముగించుకుని ఆయన లేట్ నైట్ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అల్లు అర్జున్, అరవింద్ ను పలకరించి వచ్చారు. వారంతా బాగానే ఉంటారు. కానీ బయట వాళ్ళే తెగ గుసగుసలాడేసుకుంటారు.
ఇక ఈరోజు సోమవారం కనకరత్నం గారి పెద్ద కర్మ హైదరాబాద్ లో జరిగింది. ఈ కర్మ కి గంట శ్రీనివాస్, బొత్స సత్యన్నారాయణ, రఘురామరాజు, కేటీఆర్ తో సహా పలువురు రాజకీయనేతలొచ్చి నివాళులు అర్పించి వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ అక్కడ తన కొడుకు అకీరా తో కలిసి కనిపించారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, అరవింద్ తో కలిసి మాట్లాడుతున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడం చూసి ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కావాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ పక్కనే కూర్చుని రామ్ చరణ్ తో మాట్లాడుతున్న పిక్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొట్టడం చూసి.. మెగా-అల్లు ఫ్యాన్స్ ఇద్దరూ ఫుల్ హ్యాపీ గా కనిపిస్తున్నారు.