ఈమధ్యన ఓటీటీ డీల్ సెట్ అవ్వడానికి చాలా సినిమాలు నానా కష్టాలు పడుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలకు ఆరు నెలలకు ముందే ఓటీటీ డీల్ తెగ్గొట్టేస్తున్నారు. రీసెంట్ గా జియో ప్లస్ హాట్ స్టార్ అఖండ తాండవం చిత్ర ఓటీటీ రైట్స్ ని ఏకంగా 85 కోట్లకు డీల్ పూర్తి చేసి ఆ చిత్రంపై ఎంత క్రేజ్ ఉందో చూపించింది.
ఇప్పుడు అదే కోవలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరు ల మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం ఓటీటీ డీల్ ఫినిష్ అయ్యింది అని తెలుస్తుంది. అనిల్ రావిపూడి చిరు తో చేస్తున్న శంకర్ వరప్రసాద్ గారు చిత్ర షూటింగ్ ని పరుగులుపెట్టిస్తున్నారు. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కిస్తున్న ఈచిత్ర ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి.
అందులో అమెజాన్ ప్రైమ్ వారు మన శంకర్ వర ప్రసాద్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం తో జీ 5 ఎంత లాభాపడిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి నుంచి రాబోతున్న ఈ శంకర్ వర ప్రసాద్ గారు పై ఉన్న క్రేజ్ తోనే అమెజాన్ ప్రైమ్ వారు భారీ ధర కోట్ చేసి డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.