Advertisement
Google Ads BL

నందమూరి వారసుడు ఎక్కడయ్యా..


నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ విషయంలో నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. గత ఏడాది ఇదే టైమ్ లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పోస్టర్ విడుదల చేసి మోక్షజ్ఞ బర్త్ డే కి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. దానితో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ తర్వాత ఆ ప్రోజెక్టు పై ఉలుకూ పలుకు లేదు. బాలయ్య కూడా మోక్షజ్ఞ విషయంలో మౌనం వహిస్తున్నారు. 

Advertisement
CJ Advs

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్సమెంట్ వచ్చి ఏడాది అయినా.. మోక్షజ్ఞ ఇంకా సెట్ పైకి వెళ్లకపోవడంపై అభిమానులు నిరాశపడుతున్నారు. ఒక్క సినిమా స్టార్ట్ అయితే మోక్షుజ్ఞ తదుపరి సినిమాలు లైన్ పడతాయని అభిమానుల ఆశ. కానీ మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మాత్రం జరగడమే లేదు.  

బాలకృష్ణ ఆదిత్య 999 తో మోక్షజ్ఞ ను వెండితెరకు పరిచయం చేస్తారనే ప్రచారం జరిగింది. ఘాటీ ప్రమోషన్స్ లో ఆదిత్య 999 ప్రాజెక్ట్ పై చెప్పండి, ఆ సినిమాలో మోక్షజ్ఞ కనిపిస్తాడా అని క్రిష్ ను అడిగితే దర్శకుడు క్రిష్ అది బాలయ్యే చెప్పాలని తప్పించుకున్నారు. అటు బాలయ్య  కొడుకు హీరో గా రెడీ అయ్యాడు, అతన్ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పిద్దామనే విషయంలో ఇంకా ముహూర్తం పెట్టలేదో ఏమో.. ఆయన మాత్రం కామ్ గా ఉన్నారు. 

అదే నందమూరి అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ బర్త్ డే ని ఇంత డల్ గా ముగించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క నందమూరి వారసుడు ఎక్కడయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఆ శుభతరుణం ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Mokshagna Birthday Turns Dull:

Balakrishna son Moskhagna debut delayed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs