బాహుబలి తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తున్న స్వీటీ అనుష్క శెట్టి.. కరోనా సమయంలో నిశ్శబ్దం సినిమా చేసింది. అది ఓటీటీలో రిలీజ్ అయినా అంతగా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. ఆతర్వాత చాలా గ్యాప్ తో మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి చేసింది. అది కూడా సో సో అనిపించేసింది. సినిమాలు చేస్తుంది కానీ అనుష్క ప్రమోషన్స్ కు రావడం లేదు.
ఇప్పుడు కూడా దర్శకుడు క్రిష్ తో ఘాటీ మూవీ చేసింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఘాటీ పదే పదే వాయిదాలు పడుతూ నిన్న శుక్రవారం సెప్టెంబర్ 5 న విడుదలైంది. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసు ని ఘాటీ అయినా తట్టి లేపుతుంది అనుకుంటే.. ఘాటి కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. అనుష్క బరువు, ఆమె వాయిస్ పై విమర్శలు ఎక్కువయ్యాయి.
అలాంటి ట్రోల్స్ కి భయపడే అనుష్క మీడియా ముందుకు రావడం లేదు. సినిమాల్లో ఆమెను సీజీ లో చెక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, చాలామంది అనుష్క ఆంటీ సినిమాలు చేయకపోవడమే బెటర్ అంటూ మాట్లాడుతున్నారు. అనుష్క అభిమానులు కూడా ఘాటీ రిజల్ట్ తో చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.
ఘాటీ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. అరిగిపోయిన నేరేషన్, ఎమోషన్స్ బలంగా లేకపోవడం, విలన్ తేలిపోవడం ఇవన్నీ ఘాటీ కి మైనస్ లుగా నిలిచాయి. అనుష్క శీలావతి కేరెక్టర్ లో అద్దరగొట్టినా సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో స్వీటి అభిమానులు చాలా అంటే చాలా నిరాశపడుతున్నారు.
ఇకపై చాలా సినిమాలు చేస్తాను, మీడియా ముందుకు వస్తానని మాటిచ్చిన అనుష్క ఇకపై ఎలాంటి సబ్జెక్ట్ తో రాబోతుందో చూద్దాం.