కొన్నాళ్లుగా పెద్ద సినిమాలపై చిన్న సినిమాల విజయం బాక్సాఫీసు దగ్గర కనిపిస్తూనే ఉంది. ఈ వారం థియేటర్స్ లో విడుదలైన మూడు సినిమాల్లో రెండు పెద్ద సినిమాలు, ఒకటి చిన్న సినిమా. అందులో అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి చిత్రాలతో పాటుగా చిన్న సినిమాగా లిటిల్ హార్ట్స్ విడుదలైంది.
ఘాటి చిత్రానికి డివైడ్ టాక్ వచ్చేసింది. అందులో స్టార్ హీరో ఉంటె ఆయన అభిమానులు ఫస్ట్ వీకెండ్ వరకు ఆదరించేవారు. కానీ ఫామ్ లో లేని అనుష్క ఘాటీ ని ఈ డివైడ్ టాక్ తో చూసే సాహసం చెయ్యడం లేదు. మరోపక్క శివ కార్తికేయన్ మదరాసి చిత్రానికి కూడా తెలుగులో నెగెటివ్ టాక్ రావడంతో ఆ చిత్రము కూడా బాక్సాఫీసు దగ్గర బోసి పోయింది.
ఇక ఈ రెండు చిత్రాలు ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లగా ఈ గ్యాప్ లో మెల్లగా లిటిల్ హార్ట్స్ ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. ఈటివి విన్ వారి ఈ సినిమా కంటెంట్ నచ్చి బన్నీ వాస్, వంశి నందిపాటిలు థియేటర్స్ లో విడుదల చేసారు. ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. రోజు రోజుకి లిటిల్ హార్ట్ కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. మౌత్ టాక్, సోషల్ మీడియా టాక్ లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్ పెరగడానికి దోహదపడ్డాయి.
సో ఈ వారం పెద్ద సినిమాలైనా ఘాటీ, మదరాసి చిత్రాలు పక్కకెళ్ళిపోగా.. లిటిల్ హార్ట్స్ మాత్రం థియేటర్స్ లో దూసుకుపోతుంది.