చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా టర్న్ అయిన తేజ సజ్జ హీరోగా కెరీర్ మొదలు పెట్టాక హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ ఎలాంటి అంచనాలు లేకుండా వందల కోట్లు కొల్లగొట్టింది. దానితో తేజ సజ్జ పాన్ ఇండియా ఆడియన్స్ కి హీరోగా రిజిస్టర్ అయ్యాడు.
ఆ తర్వాత తేజ సజ్జ బిగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసాడు. అయితే హనుమాన్ సక్సెస్ తర్వాత తేజ సజ్జ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటికి పిలిచి డిన్నర్ పార్టీ ఇచ్చిన విషయం చాలా అంటే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిరాయ్ ప్రమోషన్స్ లో తేజ సజ్జ ఈ విషయాన్ని బయటపెట్టాడు.
మిరాయ్ ఇంటర్వ్యూలో యాంకర్ హనుమాన్ హిట్ తర్వాత మిమ్మల్ని ఎన్టీఆర్ పిలిచి పార్టీ ఇచ్చారట కదా అని అడిగిన ప్రశ్నకు తేజ సజ్జ పార్టీ కాదండీ.. డిన్నర్ కి ఇంటికి ఆహ్వానించి నన్ను అప్రిషెట్ చేశారు అంటూ తేజ సజ్జ.. ఎన్టీఆర్ తో డిన్నర్ పార్టీ విషయాన్నీ బయటపెట్టాడు.