సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్స్డ్ 2025 సైమా 13వ ఎడిషన్ వేడుక దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులు అందజేసారు. 2024లో విశేష ప్రతిభ కనబర్చిన నటీనటులు, చిత్ర బృందాలకు అవార్డులు ప్రదానం చేసారు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిన `కల్కి 2898` ఏడీ` ఉత్తమ చిత్రంగా నిలిచింది. `పుష్ప-2`, `కల్కీ` చిత్రాలకు ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు వరించాయి.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ , ఉత్తమ నటిగా రష్మికా మందన్నా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్ నిలిచారు. అలాగే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా విభాగంలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ పురస్కారం అందుకున్నారు. అవార్డులుకు సంబంధించిన తెలుగు వారి పూర్తి వివరాలివే.
ఉత్తమ చిత్రం – కల్కి, ఉత్తమ దర్శకుడు – సుకుమార్, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ,
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్, ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా ,ఉత్తమ నటి – రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి, ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్ ,ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్ ,ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ), ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి, ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి ,ఉత్తమ గాయని – శిల్పా రావు, ఉత్తమ ప్రతినాయకుడు – కమల్ హాసన్, ఉత్తమ పరిచయ నటి – పంకూరి, భాగ్యశ్రీ బోర్స్ ,ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్, ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని ,ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు, ఉత్తమ హాస్యనటుడు – సత్య అవార్డులు అందుకున్నారు.