Advertisement
Google Ads BL

అంబటి రాంబాబు జైలుకెళతారా


వైసీపీ ప్రభుత్వంలో చాలా యాక్టీవ్ గా ఉన్న అంబటి రాంబాబు.. ఇప్పుడు అధికారం పోయాక కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చెయ్యబోతుందా, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల బదిలీలు, కోడి పందేల, రియల్‌ ఎస్టేట్‌ వరకు పలు ఆరోపణలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

కూటమి ప్రభుత్వం వచ్చాక అంబటి రాంబాబు పై పలు ఫిర్యాదులు వచ్చిన ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంబటి పై చర్యలు తీసుకోవడానికి రెడీ అవడమే కాదు, అందుకోసం విజిలెన్స్‌ అధికారులను రంగంలోకి దించింది. 

జగనన్న కాలనీల కోసం ఎకరం రూ.10 లక్షలకు కొనుగోలు చేసి.. అదే భూమిని ప్రభుత్వానికి ఎకరం రూ.30 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు అంబటి రాంబాబు. అప్పట్లో అంబటి వేధింపులు, బెదిరింపులు భరించలేక వైసీపీ పార్టీ నాయకుడొకరు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వం ఉండగానే అంబటి అవినీతి బాగోతంపై అనేక ఫిర్యాదులు ఉండటంతో విజిలెన్స్ ఫోకస్ చేసింది. 

మరి విజిలెన్స్ అధికారుల నివేదికను బట్టి ప్రభుత్వం అంబటి పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అంబటి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Ambati Rambabu Drowning in Scandals, Vigilance :

Ambati Rambabu faces vigilance probe over land and job scams
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs