బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కావడానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. ఈ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సీజన్ 9 ని గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నారు. నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోయే ఈ సీజన్ ని ఏదో సరికొత్తగా అంటూ యాజమాన్యం తెగ బిల్డప్ ఇస్తుంది. అగ్నిపరీక్ష అంటూ కామన్ మ్యాన్ ఎంపిక చేపట్టింది. అగ్నిపరీక్ష స్టేజ్ బిగ్ బాస్ హౌస్ లా కనిపించింది.
ఇక ఈ సీజన్ లో సెలెబ్రిటీస్ vs కామన్ మ్యాన్స్ అన్న రేంజ్ లో బిగ్ బాస్ ఆట ఉండబోతుంది అనేది ప్రోమోస్ లో క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ సీజన్ న్యూస్ మొదలయ్యాక హౌస్ లోకి వాళ్లేలుతున్నారు, వీళ్ళు అడుగుపెడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
మరో రెండు రోజుల్లో మొదలు కాబోయే ఈ సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, హర్షిత్ రెడ్డి, సుమన్ శెట్టి, ఆశా షైనీ, కమెడియన్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీరియల్ నటుడు భరణి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు సెలబ్రిటీస్ లిస్ట్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇక కామన్ మ్యాన్స్ లిస్ట్ లో శ్రీజ, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీరిలో ఎంతమంది బిగ్ బాస్ 9 హౌస్ లోకి అడుగుపెడతారో అనేది జస్ట్ 2 రోజులు వెయిట్ చేస్తే సరి.