Advertisement
Google Ads BL

లవ్ స్టోరీస్ ని మిస్ అవుతున్న చైతు


లవ్ స్టోరీస్ ని మిస్ అవుతున్నా అంటూ నాగ చైతన్య తన 16 ఏళ్ళ సినీ ప్రయాణం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. ఈ 16 ఏళ్ళ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే... చాలా హ్యాపీ గా, సంతృప్తిగా ఉంది. సినిమానే నా లైఫ్ అనేది అర్ధమైంది. కెరీర్ ఆరంభంలో ప్లాప్స్ వస్తే చాలా బాధగా ఉండేది. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ప్లాప్ అయినా, లేదంటే వేరే ఏదైనా సమస్య వస్తే అసలు దానికి కారణం ఏమిటి అనేది వెతుక్కుంటున్నాను. రిజల్ట్ ని చూడొద్దు,  సినిమా నుంచి వచ్చిన ఎక్స్ పీరియన్స్ తో ముందుకు వెళ్లాలని నాన్న చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపించాయి.

మజిలీ, లవ్ స్టోరీ చిత్రాలు చేసాక నా ఆలోచనా విధానమే మారిపోయింది. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమమయం. తాత మొదలుకొని మేం చేసిన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. పర్సనల్ గా నాక్కూడా లవ్ స్టోరీలంటేనే చాలా ఇష్టం. ఈ మధ్య వాటిని బాగా మిస్ అవుతున్నా.. 

ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే తొందర కంటే ఆచి తూచి మంచి సినిమా అంటే ఆరు నెలలు ఆలస్యమైనా మంచి సినిమా చెయ్యాలని చూస్తున్నాను. సినిమానే నా జీవితం అంటూ నాగ చైతన్య లవ్ స్టోరీస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Naga Chaitanya on completing 16 years in cinema:

Naga Chaitanya reflects on living up to family legacy in 16 years of cinema
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs