మెగా డాటర్ నిహారిక తన సొంత కాళ్ళపై నిలబడడానికి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం పోరాడుతుంది. పర్సనల్ లైఫ్ లో ఎన్ని సమస్యలు ఉన్నా కెరీర్ లో ఆమె ముందుకు సాగేందుకు నిరంతరం కష్టపడుతుంది. నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాదు నటనకు కూడా సై అంటుంది. సోషల్ మీడియాలో నిహారిక పోస్ట్ లపై ట్రోలింగ్ జరిగినా ఆమె ఫొటోస్ షేర్ చెయ్యడం మానదు.
భర్త చైతన్య కు విడాకులిచ్చి తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న నిహారిక ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. తాజాగా నిహారిక తన తల్లి పద్మజను సోషల్ మీడియా వేదికగా క్షమించమని అడగడం హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా నిహారిక షేర్ చేసిన ఓ వీడియో లో జలపాతం వద్ద తడుస్తుంది. ఆ వీడియో కింద ఆమె ఇచ్చిన క్యాప్షన్.. మా అమ్మ నేను క్షేమంగా రావాలని ప్రార్థనలు చేస్తుంటే.. నేనేమో జలపాతం వద్ద తడుస్తున్నా.. సారీ అమ్మ అంటూ తన తల్లి పద్మజను క్షమించమని అడుగుతుంది.
నిహారిక వీడియో పోస్ట్ పై ఆమె వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవ్వుతున్న ఎమోజీతో రియాక్ట్ అవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.