వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా కి కింగ్ గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డిపై బ్లూ మీడియా మండి పడుతుంది. వైసీపీ అధికారం పోగానే బ్లూ మీడియాలోని ఓ వర్గం భార్గవ్ రెడ్డిపై కక్ష గట్టింది. సజ్జల భార్గవ్ రెడ్డి వలనే వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది, సజ్జల భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించాలని పోరాడింది. ఫైనల్ గా జగన్ సజ్జల భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించడంతో బ్లూ మీడియా శాంతించింది.
అయితే కూటమి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలతో బాదపెట్టిన ప్రతి ఒక్కరిని ఏరి ఏరి జైలుకు పంపించింది. సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుత హోమ్ మంత్రి అనితను ఇంకా టీడీపీ మహిళా నేతలను కించపరిచే పోస్ట్ లు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సజ్జల భార్గవ్ రెడ్డిని టార్గెట్ చేసి జైలుకు పంపుతుంది అనుకున్న బ్లూ మీడియాకు నిరాశే మిగిలిందని. సజ్జల భర్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ తో జైలు ముఖం చూడకుండా తప్పించుకోవడం బ్లూ మీడియాకు మింగుడు పడలేదు.
అయితే ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి పేరు లిక్కర్ స్కామ్ లో వినిపించడంతో బ్లూ మీడియా శాంతించింది. సోషల్ మీడియా వ్యవహారంలో తప్పించుకున్న సజ్జల భార్గవ్ రెడ్డి ని లిక్కర్ స్కామ్ లో కచ్చితంగా అరెస్ట్ చేస్తారని బ్లూ మీడియా సంబరపడుతుంది. ప్రస్తుతం ఏపీ ని కుదిపేస్తున్న లిక్కర్ కేసులో పలువురు వైసీపీ నేతలు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. కనీసం బెయిల్ కూడా రాక నానా తంటాలు పడుతున్నారు.
ఇప్పుడు ఈ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పెసెస్ ఎల్ ఎల్ పి అనే సంస్థలో డైరెక్టర్స్ గా ఉన్నట్లుగా సిట్ అధికారులు గురించారు. మరి సజ్జల భార్గవ్ రెడ్డి పేరు లిక్కర్ స్కామ్ లో వినిపించింది అంటే.. అది ఎక్కడి వరకు వెళుతుందో అనేది వేచి చూడాల్సిందే.