Advertisement
Google Ads BL

ఈ సీజ‌న్‌లో అత్యంత వివాదాస్ప‌ద సినిమా


ఈ సీజ‌న్‌లో అత్యంత వివాదాస్ప‌ద‌మైన సినిమా ఏది? అంటే.. క‌చ్ఛితంగా వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన `ది బెంగాల్ ఫైల్స్` అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. బెంగాళ్ లో ముస్లిమ్ లీగ్ అల్ల‌ర్లు, హిందూ స‌మాజంపై దారుణ మార‌ణ కాండ నేప‌థ్యంలో రూపొందించిన  ఈ చిత్రం చాలా వివాదాల‌ను మోసుకొచ్చింది. ఈ సినిమా సెన్సార్ ప‌రంగా చాలా చిక్కుల్ని ఎదుర్కొని రివైజింగ్ క‌మిటీకి కూడా వెళ్లింది.

Advertisement
CJ Advs

1946లో డైరెక్ట్ యాక్షన్ డే , కలకత్తా అల్లర్ల ఆధారంగా తీసిన ఈ చిత్రం ఆగస్టు 16న కోల్‌కతాలో ట్రైలర్ విడుదలైనప్పటి నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. బెంగాల్‌లో రాజకీయాలను పెంచేందుకు తీసిన చిత్ర‌మిద‌ని అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండేళ్ల‌ క్రితం ఈ చిత్రాన్ని అనుమతించబోమని బహిరంగంగా చెప్పారని అగ్నిహోత్రి తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. బెంగాలీలను అవమానించే ది బెంగాల్ ఫైల్స్ అనే చిత్రాన్ని నిర్మించడానికి కొంద‌రు నిధులు సమకూర్చి పంపారని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. నేను దానిని ఎప్పటికీ అనుమతించను.. అని అన్నారు. ఆ తర్వాత చాలా మంది మమ్మల్ని బెదిరించడం ప్రారంభించారని కూడా అగ్నిహోత్రి అన్నారు.  సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ద‌ర్శ‌కుడు అగ్నిహోత్రిపై ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం మొద‌లైంద‌ని కూడా ఆరోపించారు.

ఈ సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టించ‌గానే ప్ర‌తి రెండు రోజుల‌కోసారి ఎఫ్ఐఆర్ న‌మోద‌వుతోంద‌ని, ఇదంతా త‌మ‌ను బెదిరించేందుకు ప‌న్నాగం! అని కూడా అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఉన్న‌ప్పుడు వ‌రుస‌గా ఎఫ్ఐఆర్ లు న‌మోద‌య్యాయ‌ని అగ్నిహోత్రి తెలిపారు. అలాగే రాజ‌కీయ ఒత్తిళ్ల కార‌ణంగా థియేట‌ర్ య‌జ‌మానులు ట్రైల‌ర్ ని కూడా రిలీజ్ చేయ‌డానికి వెన‌కాడారు. న‌గ‌రంలో దిగితే రాజ‌కీయ ఒత్తిళ్లు ఉంటాయి. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా త‌మ‌కు తెలిసింద‌ని అన్నారు. చివ‌రికి పోలీసులు కూడా మా ప్ర‌చారానికి అడ్డు చెప్పి రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌ని చెప్పిన విష‌యాన్ని అగ్ని హోత్రి గుర్తు చేసుకున్నారు. ది బెంగాల్ ఫైల్స్ సినిమా ముందస్తు బుకింగ్‌లు ఆగస్టు 31న ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు, అగ్నిహోత్రి చెప్పినట్లుగా బెంగాల్ ప్రభుత్వం సినిమా విడుదలను నిలిపివేస్తూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. గత 24 గంటల్లో ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించాము. థియేటర్లను ఖరారు చేసాము. నా పంపిణీదారుల ద్వారా నాకు తెలిసింది. బెంగాల్‌లో పంపిణీదారులకు వేర్వేరు మతాలు ఉన్నాయి. ఇది చరిత్ర సృష్టిస్తుంది. కానీ రాజకీయ గందరగోళం ఏర్పడుతుందనే భయంతో థియేటర్లు ఇప్పుడు దానిని ప్రదర్శించడానికి నిరాకరిస్తున్నాయి అని అన్నారు.

ది తాష్కెంట్ ఫైల్స్ (2019) , ది కాశ్మీర్ ఫైల్స్ (2022) తర్వాత వివేక్ అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ ని తెర‌కెక్కించారు. ఇందులో మిథున్ చక్రవర్తి, శాశ్వత ఛటర్జీ, అనుపమ్ ఖేర్, ప్రియాంషు ఛటర్జీ, దర్శన్ కుమార్ త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

The Bengal Files:

The Bengal Files
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs