లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. తీహార్ జైల్లో దాదాపుగా ఐదున్నర నెలలు ఉండి బెయిల్ పై విడుదలై వచ్చాక అటు అన్న కేటీఆర్ ఇటు బావ హరీష్ రావు ల పైనే కాదు తండ్రి కేసీఆర్ పైన కూడా ఆమె ఆగ్రహంగానే ఉన్నారు. డైరెక్ట్ గా తండ్రితో ఢీ కొట్టి అన్న కేటీఆర్ ను మాటలంటే తనకే నష్టమనుకున్న కవిత తన కోపాన్ని హారిష్ రావు పై చూపిస్తుంది.
కాదు కాదు చూపించేసింది. అన్న కేటీఆర్ ని అని అనకుండా మొత్తం నెపం హరీష్ రావు పై నెట్టేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి మాక కేసీఆర్ కి అంటడానికి కారణం హరీష్ రావు, కేసీఆర్ రాజీనామాను ఆపి వైఎస్సాఆర్ ని కలిసి మంతనాలు చేసింది హరీష్ రావు, ఎన్నికల్లో అటు ఇటు అయితే తన దగ్గరనున్న ఎమ్యెల్యేలతో హరీష్ రావు జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కవిత హరీష్ రావు పై అనేక ఆరోపణలు చేసింది.
తనని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి పంపించేందుకు హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర పన్నారు, ఆ విషయం అన్న కేటీఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి చెబితే మూడు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ, హరీష్ రావు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యాడు.. హరీష్ రావు పై కవిత తీవ్ర ఆరోపణలు చేసింది.
మరి ఈ ఆరోపణలపై హరీష్ రావు కౌంటర్ ఇవ్వకపోతే హారిష్ రావు రాజకీయ జీవితానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు. అంతేకాదు హరీష్ రావు కవిత ఆరోపణలపై స్పందించకపోతే అదే కవితకు ప్లస్ అవుతుంది. ఆమె రాజకీయ ఎదుగుదలకు కారణమవుతాయి, త్వరగా కేసీఆర్ తో మాట్లాడి హరీష్ రావు మీడియా మీట్ పెట్టాలంటూ పలువురు హారిష్ కు సలహాలు కూడా ఇస్తున్నారు. మరి కవిత ఆరోపణలపై హారిష్ రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.