కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి చిత్రం ఆగష్టు 14 న విడుదలైంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదలైన కూలి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు నుంచి నాగార్జున, మలయాళం నుంచి సౌబిన్, హిందీ నుంచి ఆమిర్ ఖాన్, కన్నడ నుంచి ఉపేంద్ర లను కూలీలో భాగం చేసి లోకేష్ కనగరాజ్ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు.
కానీ కూలి ఏ భాష లోని ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం సూపర్ స్టార్ పాత్ర, నాగార్జున పాత్ర, సౌబిన్ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయినా లోకేష్ మేకింగ్ స్టయిల్, కథ అన్ని సినిమాకి డ్యామేజ్ గా నిలిచాయి. నిజానికి ఈ సినిమా 1000 కోట్ల వరకూ రాబడుతుందని అనుకున్నారు. కానీ కూలి 500 కోట్లు రాబట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
కూలి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్నారు. అయితే థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన కూలి ని అమెజాన్ ప్రైమ్ వారు త్వరగా స్ట్రీమింగ్ లోకి తెస్తుంది అనే ప్రచారం మొదలైంది. ఈ నెల 11నుంచి కూలి ని స్ట్రీమింగ్ చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. మరి విడుదలైన నెలలోపే కూలి ని ఓటీటీ లో ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా.. అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.