కల్వకుంట్ల కవిత ని బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చెయ్యడంతో కవిత కూడా తగ్గేదేలే అంటూ పార్టీ సభ్యత్వానికి, ఎమ్యెల్సీ పదవికి రాజీనామా చెయ్యడమే కాదు అన్న కేటీఆర్ ను హెచ్చరిస్తూనే కేటీఆర్ ను కడిగిపారేసింది. మరోపక్క కెసిఆర్ ను పొగుడుతూ హరీష్ రావు, సంతోష్ రావు ల అక్రమాలను ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టింది.
తనపై వస్తున్న ఆరోపణలను, ప్రచారాలను ఆపాలని కేటీఆర్ ను వేడుకున్నాను, హరీష్ రావు, సంతోష్ రావు ల కుట్ర వల్లే పార్టీ నుంచి నన్ను బయటికి పంపించారు, కేసీఆర్ గారు ఒత్తిడిలో ఉన్నారు, అందుకే కొంతమంది నేతలు నన్ను బయటికి పంపేలా ఆయన్ను మభ్యపెట్టారు అంటూ కవిత ప్రెస్ మీట్ పెట్టి గొంతు చించుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం కూతురు కవిత ప్రెస్ మీట్ వినకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారో తెలుసా..
అయితే ఆయన ఏ టీవీలోనో కవిత ప్రెస్ మీట్ లైవ్ చూస్తున్నారు అనుకున్నవారికి ఆయన పెద్ద షాకే ఇచ్చారు. బిడ్డ ప్రెస్ మీట్ వింటూ బీపీ తెచ్చుకోకుండా కేసీఆర్ కవిత ప్రెస్ మీట్ సమయంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ కారులో చక్కర్లు కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట సంచలంగా మారింది.
తెలంగాణాలో శక్తిగా ఎదిగి ఎదురు లేదు అనుకున్న కేసీఆర్ కి కుటుంబ రాజకీయ కునుకు రాకుండా చేస్తున్నాయి. కవిత వివాదం ఊపిరి సలపనియ్యడం లేదు. అందరికి నచ్చజెప్పాల్సిన తనని తన కూతురే ఇరికించడం కేసీఆర్ కు మింగుడుపడడం లేదు. పార్టీనా, కూతురా అంటే ఆయన పార్టీ కోసమే నిలబడాల్సి వచ్చింది.