ప్రస్తుతం తండ్రి కేసీఆర్ కి అన్న కేటీఆర్ కు కొరకరాని కొయ్యగా తయారైంది కవిత. బీఆర్ఎస్ పార్టీ కి కవిత చేష్టల వలన నష్టం వాటిల్లింది. కూతురు కాబట్టి అన్నిటిని భరించిన కేసీఆర్ తనకు అండగా నిలబడిన హరీష్ రావు, సంతోష్ రావు లపై కవిత ఆరోపణలు చెయ్యడం పై కేసీఆర్ తట్టుకోలేకపోయారు. దానితో కూతురు అని కూడా చూడకుండా కవిత పై వేటు వేశారు. పార్టీ నుంచి కవిత ను బహిష్కరిస్తూ ప్రకటన చేసారు.
మరి అన్నిటికి తెగించిన కవిత ఊరుకోదుగా.. నిన్న మంగళవారం సాయంత్రం తనపై వేటు పడితే ఈరోజు బుధవారం మధ్యాన్నం కవిత ప్రెస్ మీట్ పెట్టింది. అంతేకాదు పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్యెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇక తండ్రి వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను, తన పతనం కోరుకున్న హారిష్ రావు కి పార్టీ లో సముచిత స్థానం ఇచ్చారు.
నేను పార్టీ కోసం పని చేశాను. నా మనసుకు గాయమైంది. అది చేసినది హరీష్ రావు, సంతోష్ రావు లే. మీడియా ను మేనేజ్ చెయ్యడంలో హరీష్ రావు సూపర్. రేవంత్ రెడ్డి తో హరీష్ రావు కుమ్మక్కయ్యారు. సంతోష్ రావు కూరలో ఉప్పులాంటి వాడు. కేటీఆర్ యూట్యూబ్ ని మ్యానేజ్ చేస్తే.. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తున్నాడు. నాపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టమని కేటీఆర్ ని వేడుకున్నాను.
తీహార్ జైలు నుంచి వచ్ఛాక ఎన్నో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాను. నా ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్ లకు అన్యాయం చెయ్యను. హరీష్ రావు, సంతోష్ రావు లు నన్ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్ర చేసారు. కొంతమంది నేతల ఒత్తిడి వల్లే పార్టీ నుంచి కేసీఆర్ నన్ను సస్పెండ్ చేసారు. కాళేశ్వరం పై రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఆరోపణలు చేసినా హరీష్ రావు పై ఎందుకు చెయ్యడం లేదు.. ఎందుకంటే వారు కుమ్మక్కయ్యారు కాబట్టి.
ఆరడుగుల బుల్లెట్ ఈరోజు నాకు గాయం చేసింది, రేపు మీకు గాయం చేస్తుంది.. కేటీఆర్ గారు జాగ్రత్త మీ పార్టీని, కార్యకర్తలను కాపాడుకోండి, నేను అన్ని రకాలుగా ఆలోచించాక నా తదుపరి నిర్ణయం చెబుతాను. అంతేకాని అందరూ అనుకుంటున్నట్టుగా నేను ఏ పార్టీలో చేరడం లేదు అంటూ కవిత ప్రెస్ మీట్ లో మరోసారి హరీష్ రావు, సంతోష్ రావు లపై ఆరోపణలు చేసింది.