గత ఏడాది డిసెంబర్లో హీరో నాగ చైతన్య.. శోభిత దూళిపాళ్లను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చైతు-శోభిత లు ఇష్టపడి పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. పెళ్లి తర్వాత కెరీర్ లో బిజీ అయ్యి ఆతర్వాత కొద్దిరోజులకే హనీమూన్ అంటూ వెళ్లిన ఈ జంట అటుపిమ్మట ముంబై లో శోభిత, హైదరాబాద్ లో నాగ చైతన్య ఉంటున్నారు. తమ షూటింగ్ ల కారణంగా ఇలా విడివిడిగా ఉంటున్నామని కలిసినప్పుడు మాత్రం ఒకరికొకరం అనేలా ప్లాన్ చేసుకుంటామని చైతు చెప్పుకొచ్చాడు.
ఇక శోభిత తన సినిమా షూటింగ్ లో ఉండగా.. నాగ చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో NC 24 లో నటిస్తున్నాడు. దానికోసం చైతు హైదరాబాద్ లోనే ఉండాల్సి వస్తుంది. అయితే శోభిత తన సినిమా షూటింగ్ సెట్ లో వంట చేస్తున్న ఫొటోస్, వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యమంటూ ఆ ఫొటోస్ కింద క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
ఆ వీడియో ని లైక్ చేసిన నాగ చైతన్య తన భార్య శోభితకు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. ఈ నైపుణ్యాల రుచిని చూడటానికి వేచి ఉన్నా అంటూ నాగ చైతన్య కామెంట్ చేసాడు. వీరి సోషల్ మీడియా సంభాషణ చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు.